అలా నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా – రఘురామిరెడ్డి

Friday, September 18th, 2020, 12:08:32 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య వరుస విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అటవీ భూముల ఆక్రమణ పై తెలుగు దేశం పార్టీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపణలను ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఖండించారు. అయితే గతంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా ఎంతో మంది పేదలకు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. అయితే, బి. మఠం లో తనకు ఒక్క సెంటు భూమి కూడా లేదు అని తేల్చి చెప్పారు.అయితే తన పై వస్తున్నటువంటి ఆరోపణలను నెల రోజుల లోపు నిరూపించాలి అంటూ టీడీపీ ఎమ్మెల్యే కి సవాల్ విసిరారు.

అయితే ఆక్రమణ ఆరోపణలను నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అలా నిరూపించ నీ పక్షం లో నాలుగు రోడ్ల కూడలి లో తప్పు ఒప్పుకొని లెంపలు వేసుకోవాలి అని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే. అయితే అలా చేయని పక్షం లో చట్టపరమైన చర్యలు తీసుకుం టా అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సుధాకర్ యాదవ్ ఎన్నో అవినీతి, ఆక్రమణ లకు పాల్పడ్డారు అని, అంతేకాక ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్లు సంపాదించారు అని ఆరోపించారు. అయితే తొందర్లో సుధాకర్ యాదవ్ అక్రమాలను, అవినీతిని బయట పెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.