బినామీల పేర్లతో మీరు భూములు కొనుగోలు చేయలేదా?

Wednesday, January 20th, 2021, 08:50:43 AM IST

పరిటాల శ్రీరామ్ చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే తోదుపుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు వరుస ప్రశ్నలు గుప్పిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ పాలనలో అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా రాప్తాడు కి జరిగిన ప్రయోజనం ఏమీ లేదు అని అన్నారు. అయితే పరిటాల కుటుంబం దోపిడీ తప్ప చేసిందేమీ లేదు అంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. గతంలో ఉన్న ఆస్తులు ఎన్ని, ఇప్పుడు మీకు ఉన్న ఆస్తులు ఎన్ని అని సూటిగా ప్రశ్నించారు. ఎక్కడి నుండి వచ్చాయో చెప్పగలవా అని నిలదీశారు. అంతేకాక పరిటాల రవీంద్ర పేరు చెప్పి ఇష్టారాజ్యంగా భూములు లాక్కున్న ఘనత మీది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవే పరమావధి గా పని చేసే మనస్తత్వం మాది అంటూ చెప్పుకొచ్చారు.

అయితే రాజధాని అమరావతి లో కూడా బినామీ ల పేర్లతో భూములు కొనుగోలు చేయలేదా అంటూ పరిటాల శ్రీరామ్ పై వ్యాఖ్యలు చేశారు.అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించి వాటిని బయటపెడతా అని అన్నారు. అయితే పరిటాల కుటుంబం లాగా కక్ష తో దిగజారుడు రాజకీయాలు చేయం అంటూ చెప్పుకొచ్చారు.