రాజకీయం గా ఎదుర్కోలేక ఇటువంటి దుర్మార్గ చర్యలు

Sunday, January 17th, 2021, 10:09:51 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార మరియు ప్రతి పక్ష పార్టీ లకు తీవ్ర స్థాయిలో మాటల యుద్దాలు నడుస్తున్నాయి. అయితే తాజా పరిణామాల పై వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వం అన్ని కులాలను, మతాలను సమానం గా గౌరవిస్తుంది అని అన్నారు.అయితే నరసారావు పేట లో సీఎం జగన్ చేతుల మీదుగా గోపూజ జరగడం సంతోషం గా ఉందని అన్నారు. అయితే దేవాలయాల పై దాడులు, విగ్రహాల ధ్వంసం ప్రతి పక్షాల కుట్ర అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేవుళ్ళను రాజకీయాల్లోకి లాగడం వారి నీచ రాజకీయాలకి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే రాజకీయం గా తమను ఎదుర్కోలేక ప్రతి పక్షాలు ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు అని విమర్శలు చేశారు. అయితే ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపిస్తూ నే ప్రతి పక్ష పార్టీ ల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.