ప్రభుత్వం మీద నిరసన ఎందుకో సోము వీర్రాజు చెప్పాలి – అంబటి రాంబాబు

Thursday, September 10th, 2020, 08:44:02 PM IST

Ambati_rambabu
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అంతర్వేది రథం దగ్ధం ఘటన పై ప్రభుత్వం దే నిర్లక్షం అని, బీజేపీ, జన సేన పార్టీ లు నేడు నిరసన వ్యక్తం చేశాయి. అయితే ప్రతి పక్ష పార్టీ నేతలు చేస్తున్న వరుస విమర్శలతో అధికార పార్టీ కి చెందిన నేతలు, ఎమ్మెల్యే లు, ఎంపీ లు, మంత్రులు పలువురు వరుస విమర్శలు చేస్తున్నారు. ప్రతి పక్ష పార్టీ లు అనుసరిస్తున్న ధోరణి సరైనది కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటన పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు.

రాష్ట్ర అభివృద్ది కోసం ఒక పక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి కష్టపడుతుంటే, ప్రతి పక్ష నేతలు మాత్రం ఇటువంటి ఘటన ల పై రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు.గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలను మరొకసారి గుర్తు చేశారు.అయితే ప్రభుత్వం మీద ఎందుకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పాలి అని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం లో 39 ఆలయాలను కులదోయించిన చరిత్ర బాబుది అని ఆరోపించారు. అంతర్వేది ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది అని, దోషులను కఠినంగా శిక్షించడానికి వెనకడుగు వేయబోము అని, చంద్రబాబు నాయుడు మానవ రూపం లో ఉన్న దెయ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.