టీడీపీ కి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ యాప్

Thursday, February 4th, 2021, 07:37:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెచ్చిన యాప్ పై అనుమానాలు ఉన్నాయి అంటూ వైసీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అప్రజాస్వామికం అని, తాము నమ్మడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ కి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ యాప్ తెచ్చారని భావిస్తున్నాం అని అన్నారు. అయితే పక్షపాతం తో వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని అన్నారు. నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులను అభిశంసస చేయడం, తిరిగి విధుల్లోకి తీసుకోవడం వంటివి చూస్తుంటే సరైన విధానం లేదని అర్దం అవుతుంది అని, ప్రివిలేజ్ కమిటీ విచారణ లో అన్ని బయటికి వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు.

అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే అచ్చెన్న ను అరెస్ట్ చేశారు అని అన్నారు. రాష్ట్రంలో గందరగోళం సృష్టించడమే టీడీపీ ఎత్తుగడ అని అన్నారు. అచ్చెన్న చేసిన వ్యాఖ్యల పై అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాట తీయడానికే నా మంత్రులు అయ్యేది అని అన్నారు. నిమ్మగడ్డ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, లోకేష్ ముఖ్యమంత్రి, చంద్రబాబు ప్రధాని, అచ్చెన్న హోం మంత్రి అని పగటి కలలు కంటున్నారు అని అన్నారు. అయితే ఎన్నికల కమిషనర్ మృతుడి ఇంటికి పరామర్శ కి వెళ్ళడం ఆశ్చర్యంగా ఉందని, టీడీపీ వాళ్లు చనిపోతెనే వెళతారా లేకపోతే ఏ పార్టీ వాళ్లు చనిపోయినా వెళతారా అంటూ సూటిగా ప్రశ్నించారు. నిమ్మగడ్డ రాజకీయ నాయకుడి లా పరామర్శ కి వెళ్ళడం దురదృష్ట కరం అంటూ అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.