లోకజ్ఞానం లేని లోకేష్ రాజారెడ్డి గురించి మాట్లాడటం విడ్డూరం – వైసీపీ ఎమ్మెల్యే

Thursday, September 10th, 2020, 07:01:38 PM IST

తెలుగు దేశం పార్టీ నేతల పై వైసీపీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. అయితే హత్య కేసులో జైలు కి వెళ్లి వచ్చిన వారిని పరామర్శించడానికే నారా లోకేష్ పర్యటించారు అని, రాష్ట్ర ప్రజల కోసం కాదు అని ఎమ్మెల్యే జోగి రమేష్ ఘాటు విమర్శలు చేశారు.40 మందిని జైలు కి పంపిస్తాం అని నారా లోకేష్ సవాల్ చేయడం సరి కాదు అని, ఒక ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు చూపించాలి అని సవాల్ విసిరారు. అయితే సవాల్ విసిరి హైదరాబాద్ పారిపోవడం సరికాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టాలి అని, మీరు చేసిన పాపాలకు ప్రజలు 16 నెలలు జైల్లో పెట్టారు అని, లోక జ్ఞానం లేని నారా లోకేష్ రాజారెడ్డి గురించి మాట్లాడటం విడ్డూరం అంటూ ఎద్దేవా చేశారు. నారా లోకేష్ కి రాజారెడ్డి గురించి ఏమీ తెలీదు అని, ఆయన పేదల పెన్నిధి అని తెలిపారు. ఆయన రాజకీయాలు చేసినపుడు నారా లోకేష్ ఇంకా పుట్టలేదు అని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే మీరు హైదరాబాద్ లో ఉంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే లు ప్రజల కోసం పని చేస్తున్నారు అని తెలిపారు.