వాళ్ళు రాళ్ళు వేసుకొని చవకబారు కార్యక్రమాలు చేస్తున్నారు – వైసీపీ ఎమ్మెల్యే

Sunday, October 4th, 2020, 06:43:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ మరియు తెలుగు దేశం పార్టీ ల మధ్య తీవ్ర స్థాయిలో ఒకరి పై మరొకరు విమర్శలు చేస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ కి చెందిన నేత పట్టాభి రామ్ కార్ పై ఎవరో దుండగులు రాళ్ళు రువ్వడం పట్ల, పట్టాభి తో సహా టీడీపీ నేతలు అధికార పార్టీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైసీపీ నేత, ఎమ్మెల్యే జోగి రమేష్ ఘాటుగా జవాబు ఇచ్చారు.

కారు అద్దాలు పగిలితే మాకు ఎంటి సంబంధం అని సూటిగా ప్రశ్నించారు. నిజంగా ఘటన జరిగితే బాధ్యుల పై చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. అంతేకాక అయితే ప్రభుత్వ స్థలం ను సబ్బం హరి ఆక్రమించుకున్నారు అని, అలాంటప్పుడు చర్యలు తీసుకుంటే తప్పా అంటూ నిలదీశారు. అయితే వాళ్లు రాళ్ళు వేసుకొని ఇలా చవకబారు కార్యక్రమాలు చేస్తున్నారు అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

రథాలు తగల బెడతారు, విగ్రహాలు ధ్వంసం చేస్తారు, అందుకు ఆందోళనలు వీళ్ళే చేస్తారు. వీటికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ ప్రభుత్వాన్ని ఏమి చేయలేరు అని, ప్రతి పక్ష హోదా కూడా పోయె సమయం వచ్చింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.