ఇసుక పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారు – మల్లాది విష్ణు

Wednesday, December 2nd, 2020, 03:09:43 PM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక గురించి మాట్లాడే నైతికత చంద్రబాబు కి, టీడీపీ నేతలకు లేదు అని అన్నారు. గత అయిదేళ్ల పాలనలో ఇసుక ను బంగారం లా మార్చింది మీరు కాదా అంటూ విమర్శించారు. టీడీపీ పాలన లో ఎమ్మెల్యే లు, ఎంపీ లు ఇష్టానుసారంగా దోచుకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే కరకట్ట పక్కనే చంద్రబాబు నివాసానికి అనుకొని డ్రెడ్జర్ల తో ఇసుక తవ్విస్తే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయల ఫైన్ విధించింది అని, అది అప్పుడే మర్చిపోయారా అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే ఉచిత ఇసుక పాలసీ పేరుతో ఇసుకను దోచుకున్న మీరు ఎలా మాట్లాడతారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే టీడీపీ హయం లో ప్రారంభం అయిన ఇసుక దోపిడీని అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి వరదలు మరియు తుఫాన్ ల కారణంగా ఇసుక వెలికి తీయడానికి ఇబ్బందులు వచ్చాయి అని ఎమ్మెల్యే అన్నారు. అయితే ప్రతి పక్ష పార్టీ నేతగా సూచనలు ఇవ్వాలి కానీ,అసెంబ్లీ బయట ర్యాలీ పేరుతో డ్రామాలు కాదు అంటూ రెచ్చిపోయారు. చచ్చిపోయిన టీడీపీ ను బ్రతికించుకోవడానికి ఇసుక పేరుతో చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారు అంటూ ఎమ్మెల్యే విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.