లోకేష్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేరు – వైసీపీ ఎమ్మెల్యే

Saturday, August 22nd, 2020, 02:34:59 AM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్న తీరు పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రధాని కి చంద్రబాబు లేఖ రాసిన విషయం అందరికి తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అన్నారు. దివాళా తీసిన టీడీపీ కి బాబు అధ్యక్షుడు అని ఎద్దేవా చేశారు. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది అని, కానీ బాబు ఆధారాలు చూపించలేక పోయారు అని విమర్శించారు. అంతేకాక సీఎం జగన్ ఇళ్ళ పట్టాలు ఇస్తే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు అని, బాబు అంతర్జాతీయ అవినీతి సంఘానికి అధ్యక్షుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ మేరకు చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేశారు. ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు అని, స్కాం బాబు అంటే చంద్రబాబు అని, సూటికేస్ బాబు అంటే లోకేష్ చినబాబు అని విమర్శించారు. కరోనా సమయం లో చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు హైదరాబాద్ వదిలి రాకుండా అక్కడి నుండే జూమ్ లో మీటింగ్ లు పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక జ్ఞానం లేని లోకేష్ వాలంటీర్ వ్యవస్థ పై విమర్శలు చేస్తున్నారు అని, అసలు అ,ఆ లు రాని లోకేష్ ను చంద్రబాబు మంత్రి గా చేశారు అని వ్యాఖ్యానించారు. లోకేష్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేరు అని, లోకేష్ పై ఒక వాలంటీర్ ను పోటీకి పెట్టీ గెలిపిస్తాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.