40 ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఏమీ ఉపయోగపడలేదు – వైసీపీ ఎమ్మెల్యే

Thursday, September 3rd, 2020, 03:58:16 PM IST

vasantha-krishna-prasad

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు ఏపీ కి ప్రవాస నేతగా తయారు అయ్యారు అంటూ సెటైర్స్ వేశారు. అవినీతి, హత్యాయత్నం కేసులో జైలుకి వెళ్లి వచ్చిన తెలుగు దేశం పార్టీ నేతలను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు, ప్రజలు కరోనా తో ఇబ్బంది పడుతుంటే మాత్రం హైదరాబాద్ లో దాక్కున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం పైన వైసీపీ ఎమ్మెల్యే విరుచుకు పడ్డారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఏమీ ఉపయోగపడలేదు అంటూ విమర్శలు చేశారు. కేవలం రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోడానికి ఉపయోగ పడింది అని తెలిపారు. అయినా చంద్రబాబు తన కుమారు డిని సైతం గెలుపించుకొలేక పోయారు అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాక సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని భావిస్తూ ఉంటే టీడీపీ నేతలు కోర్టు లకు వెళ్లి అడ్డుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు మంచి చేస్తుంటే చూస్తూ ఓర్వలేక పోతున్నారు అని విమర్శలు చేశారు.