చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

Tuesday, September 1st, 2020, 10:22:42 PM IST


చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు కి టీడీపీ నేతలు సిల్వర్ జూబ్లీ చేసుకోవడం సిగ్గు చేటు అని ఎమ్మెల్యే పార్థ సారథి సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు చేసిన వెన్నుపోటు పై ప్రజలు తలదించుకుంటున్నారు అని అన్నారు. ఎన్టీఆర్ పై కుట్రలు పన్ని ఆయన్ని పదవి నుండి దించడమే కాకుండా, చెప్పులతో కొట్టి అవమానించారు అని అన్నారు. అయితే టీడీపీ నేతలు చేస్తున్న పనికి ఎన్టీఆర్ యొక్క ఆత్మ ఘోషిస్తుంది అని అన్నారు.

అయితే పార్టీ తో పాటుగా సింబల్ ను కూడా లాక్కున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు కి ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే భారత రత్న కి ఎందుకు సిఫార్స్ చేయలేదు అని నిలదీశారు. వెన్నుపోటు తో బాబు అధికారం లోకి వచ్చారు అని, 25 ఏళ్లలో బాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఒక్క పథకం కూడా చంద్రబాబు పేరు గుర్తు కి వచ్చేలా పెట్టలేదు అని వరుస విమర్శలు చేశారు.