ఇప్పటికైనా చంద్రబాబు భజన మానుకోవాలి – వైసీపీ ఎమ్మెల్యే

Friday, August 28th, 2020, 02:13:24 AM IST


పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డిఎ లని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాల్లో సుప్రీం కోర్టు తీర్పు ను ఎల్లో మీడియా వక్రీకరించి రాస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్. పత్రిక విలువలను కాలరస్తూ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలను భయ భ్రాంతులకి గురి చేసే విధంగా వార్తలు రాయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ వార్తలను ఖండిచారు. మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుండి యెల్లో మీడియా ఏదో ఒక రూపంలో అడ్డుకోవాలి అని చూస్తోంది అని అన్నారు.

అంతేకాక సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే యెల్లో మీడియా కుట్రలు కుతంత్రాలు చేస్తోంది అని మండిపడ్డారు. అంతేకాక ఇప్పటికైనా చంద్రబాబు భజన మానుకోవాలి అంటూ హితవు పలికారు. వైజాగ్ ను పరిపాలన రాజధాని, కర్నూల్ ను న్యాయ రాజధాని గా ఏర్పాటు చేస్తే చంద్రబాబు కి వచ్చిన నష్టం ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ది కోసం సీఎం జగన్ ఆలోచన చేస్తుంటే, చంద్రబాబు మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.