చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

Thursday, August 27th, 2020, 08:49:33 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు.దళితుల మీద చంద్రబాబు అండ్ కో కపట ప్రేమ చూపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు చేతిలో దగా పడ్డ దళిత నేతలు వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు సీఎం జగన్ పై పుస్తకం విడుదల చేశారు అని అన్నారు.అయితే చంద్రబాబు తన పాలన లో దళిత చట్టాలను చుట్టాలు గా మార్చారు అని ఆరోపించారు.దళితుల్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబు అన్నప్పుడే దేశం నివ్వెర పోయింది అని అన్నారు.

చంద్రబాబు నాయుడు అధికారం లో ఉండగా, దళితులు భయ భ్రాంతులతో బతికారు అని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో దళితుల పై దాడుల్లో రాష్ట్రం నాల్గవ స్థానం లో ఉంది అని అన్నారు. అయితే చంద్రబాబు పాలన లో జరిగిన దాడుల పై ఒక పుస్తకం విడుదల చేస్తున్నాం అని అన్నారు. చంద్రబాబు పాలన లో జరిగిన పలు విషయాల పై ఘాటు విమర్శలు చేశారు.