ఆ పార్టీలు చంద్రబాబు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా గా మార్చుకోవాలి

Wednesday, August 26th, 2020, 08:00:46 PM IST

అమరావతి రాజధాని పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు తీరు ను విమర్శిస్తూ మరొకసారి వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమం అనేది పచ్చి భూటకం అని ఆరోపించారు. 250 రోజుల ఉద్యమం అని చెప్పుకుంటూ పదిమంది తో ఉద్యమం నడుపుతున్నారు అని సెటైర్ వేశారు. అయితే చంద్రబాబు చేయిస్తున్న ఈ జూమ్ ఉద్యమానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి అని, అంతేకాక కారల్ మార్క్స్ సిద్ధాంతాలకు విరుద్ధంగా సీపీఐ,సీపీఎం కి వ్యవహరిస్తున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ కమ్యూనిస్ట్ పార్టీ లు చంద్రబాబు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని మార్చుకోవాలి అంటూ విమర్శలు చేశారు. లేని అమరావతి ఉద్యమాన్ని అంతర్జాతీయంగా ప్రచారం చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రజలకు అన్యాయం చేస్తావా అంటూ చంద్రబాబు పై ఎమ్మెల్యే కరణం ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పై విషం కక్కుతున్న చంద్రబాబు అని, దళితుల పై ప్రేమ ఉంటే రాజధాని ప్రాంతం లో దళితుల కోసం ఇళ్ళ స్థలాల పంపిణీ ఎందుకు అడ్డుకున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు. వైజాగ్ రాజధాని నీ అడ్డుకుంటే టీడీపీ నేతలు దేశ ద్రోహులు గా మిగిలి పోతారు అని అన్నారు.