చంద్రబాబు ను ఒకటే కోరుతున్నా…వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Saturday, August 15th, 2020, 04:58:59 PM IST

వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు, పాయకరావుపేట లో 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ను ఎగురవేసిన తర్వాత నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు చేష్టలు రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధంగా ఉన్నాయి అని ఎమ్మెల్యే బాబురావు ఆరోపించారు. ప్రజా స్వామ్యం ను ఖూనీ చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిక విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.అయితే చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చంద్రబాబు ను ఒకటే కోరుతున్నా, అభివృద్ది ను అడ్డుకోవద్దని, ప్రజల తీర్పుని గౌరవించాలి అని అన్నారు. ఎమ్మెల్యే బాబురావు చేసిన వ్యాఖ్యలు చర్చంశనీయం కాగా, ఇందుకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.