త్వరలోనే చంద్రబాబు మరో భాగోతం బయటకు రానుంది – వైసీపీ ఎమ్మెల్యే

Friday, March 26th, 2021, 07:33:26 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కున్నారు అని, దళితులను తెలుగు దేశం పార్టీ నేతలు బెదిరిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 300 ఎకరాల దళితుల భూములను కాజెయ్యడానికి ప్లాన్ చేశారు అని, చంద్రబాబు ఏ వ్యవస్థ నైనా మేనేజ్ చేస్తారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక దళితులకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే కోర్టుకి వెళ్లి అడ్డుకున్నారు అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితులు అంటే చంద్రబాబు కి చిన్న చూపు అని వ్యాఖ్యానించారు. అయితే రాజధాని ప్రాంతంలో 54 వేల మంది దళితులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామంటే, కోర్టుకి వెళతారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే త్వరలోనే చంద్రబాబు మరో భాగోతం బయటకు రానుంది అంటూ చెప్పుకొచ్చారు. అన్ని ఆధారాలతో ఆయన దొంగ చేష్టలు బయటికి రానున్నాయి అని తెలిపారు. అంతేకాక దళిత పక్షపాతి గా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పై ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.