చంద్రబాబు ప్రత్యేక హోదా ద్రోహి – వైసీపీ ఎమ్మెల్యే

Wednesday, March 24th, 2021, 07:32:43 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ను కేంద్రానికి తాకట్టు పెట్టింది చంద్రబాబే అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ప్రత్యేక హోదా ద్రోహి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ది తో ఉన్న వైసీపీని తప్పు పట్టే స్థాయి తెలుగు దేశం పార్టీ కు లేదని అన్నారు. ప్రత్యేక హోదా గురించి అచ్చెన్నాయుడు మాట్లాడటం విడ్డూరం గా ఉందని ఆయన అన్నారు. నాడు బీజేపీ తో జతకట్టి, హోదా కి బదులు గా ప్యాకేజీ బాగుందన్న చంద్రబాబు మాటలను ఆంబోతు అచ్చెన్నాయుడు మర్చిపోయారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రత్యేక హోదా కోరుతూ లోక్ సభ నుండి వైసీపీ ఎంపీ లు వాకౌట్ చేసిన విజయాన్ని అచ్చెన్నాయుడు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మర్చిపోరు అని వ్యాఖ్యానించారు.

అయితే ప్రత్యేక హోదా కోసం నాడు వైసీపీ ఎంపీ లు అంతా కూడా మూకుమ్మడి గా రాజీనామా చేయడం వాస్తవం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక ఇసుక తవ్వకాల్లో 10 వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు అని, ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తెలుగు దేశం పార్టీకి చెందిన బ్రోకర్ల ను, దళారులను, జన్మభూమి కమిటీ ల పేరుతో దోపిడీ, దొంగల ముఠా లను ఇసుక రీచ్ లలో పెట్టీ అయిదేళ్లలో 50 వేల కోట్లను స్వాహా చేసినట్టు ఒప్పుకున్నట్టే నని అర్దం అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇసుక ఎక్కడైనా ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ అడిగినా, వసూల్ చేసినా ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మేల్యే సుధాకర్ బాబు చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.