చంద్రబాబు కి మతి భ్రమించింది – మల్లాది విష్ణు

Tuesday, February 23rd, 2021, 03:20:46 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడుకు మతి భ్రమించింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శారదా పీఠం స్వామీజీ పై చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు సరికాదు అంటూ చెప్పుకొచ్చారు. స్వామీజీ కి క్షమాపణలు చెప్పాలి అంటూ మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. అయితే హిందూ ధర్మాన్ని కాపాడుతూ శారదా పీఠం లో సేవలు అందిస్తున్న స్వామీజీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు అని తెలిపారు. అంతేకాక దేవుడి పై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్వామీజీ వద్దకు వెళ్ళాలి అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

అయితే బూట్లు వేసుకొనీ పూజలు చేసే చంద్రబాబు స్వామీజీ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. అయితే పుష్కరాల్లో అమాయకుల ప్రాణాలు తీసిన చంద్రబాబు స్వామీజీ గురించి మాట్లాడటమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక విజయవాడ లో ఆలయాలు కూల్చిన మీరు స్వామీజీ గురించి మాట్లాడటం దారుణం అంటూ చెప్పుకొచ్చారు.