అందుకే అంతా నిన్ను ఓడించారు -ఎమ్మెల్యే పార్థసారథి

Thursday, January 14th, 2021, 07:23:42 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన పాపాలే శాపాలై ఆయన్ని ఓడించాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే 18 నెలలు అయినా ఇంకా నువ్వెందుకు ఒడిపోయావో తెలుసుకోలేక పోతున్నావా అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు ఒడించారో తెలుసుకోలేని చంద్రబాబు నాయుడు అక్కసు తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అవాక్కులు, చెవాక్కులు పేలడం అర్థ రహితం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోగి మంటల సాక్షిగా ఆయన అబద్ధాలు చెప్పారు అని,సాంప్రదాయాలు, దేవుడి పై ఆయనకి విశ్వాసం లేదు అని అన్నారు.

అయితే చంద్రబాబు నాయుడు గతంలో అధికారం లో ఉండగా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, రైతుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని విమర్శించారు. రైతులకు చంద్రబాబు నష్టం చేశారు అని, అన్యాయం చేశారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే ద్వజమెత్తారు. గిట్టుబాటు ధర లేక రైతులు విల విల్లాడితే పంటలను అతి తక్కువ ధరకు కొని, హెరిటేజ్ ద్వారా ఎక్కువ ధరకి అమ్ముకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నాదు అని, మొన్నటి దాకా లోకేష్ ఇప్పుడు బాలకృష్ణ స్క్రిప్ట్ రాస్తున్నా డా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.