చంద్రబాబు పథకం ప్రకారమే ఇలాంటి పనులు – వైసీపీ ఎమ్మెల్యే

Monday, September 28th, 2020, 10:34:09 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ పై తెలుగు దేశం పార్టీ నేతలు తాజాగా చేస్తున్న విమర్శల పై వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో మాజీ జడ్జి రామకష్ణ సోదరుడి పై పెద్దిరెడ్డి అనుచరులే దాడి చేశారు అని టీడీపీ తప్పుడు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దాడి చేయాల్సిన అవసరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు కానీ, వైసీపీ కి కానీ లేదు అని తెలిపారు.

అయితే చిత్తూరు జిల్లాలో ఏది జరిగినా కూడా మంత్రి పెద్దిరెడ్డి కి అంటగట్టే యత్నం చేస్తున్నారు అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక చంద్రబాబు నాయుడు పథకం ప్రకారమే ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసుల విచారణ లో మంత్రి కి సంబంధం లేదు అని తేలిపోయింది అని,ఇపుడు చంద్రబాబు నాయుడు కచ్చితంగా సమాధానం చెప్పాలి అంటూ నిలదీశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టే పని చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.