బిగ్ న్యూస్: చంద్రబాబు నాయుడు కి పోయేకాలం వచ్చింది – అంబటి రాంబాబు

Friday, September 25th, 2020, 01:13:09 AM IST

Ambati_Rambabu
తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉండగ పోలీస్ భద్రత నడుమ ఆలయాలను ధ్వంసం చేయించిన చంద్రబాబు నాయుడు కి హిందుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు అని వైసీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ లో గుళ్లను నాశనం చేసి, దేవుడి విగ్రహాలను మున్సిపాలిటీ చెత్త బండిలో వేసిన చరిత్ర ఆయనది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే మానవ సేవే మాధవ సేవ గా కొనసాగుతూ ఉన్న వైసీపీ పై నిందలు వేస్తే సహించేది లేదు అని అన్నారు.

అయితే అంతర్వేది లో రథం దగ్ధం మరియు పలు చోట్ల విగ్రహాల ధ్వంసం పై ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకుంది అని తెలిపారు. అయితే మతం ముసుగు లో కొన్ని రాజకీయ పార్టీలు తమ పై బురద జల్లి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయి అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గతంలో ఇద్దరు క్రిస్టియన్ ముఖ్యమంత్రులు తిరుమల శ్రీవారి కి పట్టు వస్త్రాలు సమర్పించారు, అయితే అప్పుడు లేని ఈ డిక్లరేషన్ ఇప్పుడు తెరపైకి ఎందుకు తీసుకు వచ్చారు అంటూ అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు.

అయితే చంద్రబాబు నాయుడు కి పోయేకాలం వచ్చింది అని, వారి మాటలు ఎవ్వరూ కూడా నమ్మవద్దు అంటూ అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.