ఓటుకి కోట్లు కేసులో చంద్రబాబు భయపడి ఏపీ కి పారిపోయారు – అంబటి రాంబాబు

Thursday, October 8th, 2020, 05:50:16 PM IST

తెలుగు దేశం పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరొకసారి ఘాటు విమర్శలు చేశారు.టీడీపీ నేతలు పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడుతున్నారు అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ది కోసమే ప్రధాని నరేంద్ర మోడీ ను సీఎం జగన్ కలిశారు అని, కానీ టీడీపీ నేతలు మాత్రం వ్యక్తి గత అజెండా కోసం కలిశారు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు అని దుయ్యబట్టారు. అయితే ఈ మేరకు చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయిన సంగట్ తెలిసిందే. అయితే రాజధాని మాత్రం 10 ఏళ్ల వరకు హైదరాబాద్. అయితే ఇంకా సమయం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఓటు కి కోట్లు కేసులో భయపడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పారిపోయారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల గురించి సీఎం జగన్ భయపడరు అని, జగన్ పై ఉన్నవన్నీ కూడా కుట్ర పూరితమైన కేసులే అని అంబటి రాంబాబు అన్నారు. ప్రజలు ఆ విషయాన్ని గమనించే 151 సీట్లతో గెలిపించారు అని తెలిపారు. చంద్రబాబు ను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు అని, చీకట్లో చిదంబరం ను కలిసిన వ్యక్తి చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని, కేంద్ర పదవులు అవసరం లేదు అని, చంద్రబాబు మారకుంటే మళ్లీ ప్రజలు బుద్ది చెబుతారు అంటూ అంబటి రాంబాబు అన్నారు.