ఓటమి కంటే పోటీ చేయకుండా ఉంటేనే మేలనుకుంటారు – అంబటి రాంబాబు

Friday, March 12th, 2021, 04:42:59 PM IST

మరొకసారి తెలుగు దేశం పార్టీ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ 11 వ వసంతం లోకి అడుగుపెడుతున్న సందర్భం లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే తో ప్రారంభం అయిన వైసీపీ దినదిన ప్రవర్థమానం గా ఎదిగి 67 సీట్లు సాధించింది అని అన్నారు. అనంతరం తర్వాత కాలం లో టీడీపీ పై పోటీ చేసి 151 స్థానాలను కైవసం చేసుకొని పార్టీ అధికారం చేపట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే మేనిఫెస్టో కి పవిత్రత ఇచ్చిన పార్టీ ఏదైనా దేశంలో ఉంది అంటే అది వైసీపీ మాత్రమే అంటూ కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైసీపీ పార్టీ చాలా గొప్పగా ఎదిగింది అని వ్యాఖ్యానించారు. అయితే వైసీపీ అందిస్తున్న పాలన తో భవిష్యత్ లో ఈ పార్టీ కి కూడా జగన్ ను ఓడించే శక్తి లేదు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ మేరకు టీడీపీ పై సైతం వరుస విమర్శలు గుప్పించారు.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. టీడీపీ మాత్రం అరకొర స్థానాలను గెలుచుకుంది. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ ఉనికి లేకుండా పోతుంది అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ కి రాబోయే శాసన సభ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడనుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఓటమి కంటే పోటీ చేయకుండా ఉండటమే మేలనుకుంటారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే సత్తెన పల్లి లో టీడీపీ కి అభ్యర్దులు దొరకని పరిస్థితి ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో సత్తెనపల్లి లో ప్రశాంత వాతావరణం చెడగొట్టడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ శత్రువులు వ్యక్తిగత శత్రువులుగా మారకూడదు అని వ్యాఖ్యానించారు.