ఆశ్చర్య పోకండి…పిచ్చి ముదిరింది…నిమ్మగడ్డ పై అంబటి రాంబాబు సెటైర్స్

Friday, January 29th, 2021, 04:24:23 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరి పై వైసీపీ కి చెందిన కీలక నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మీడియా సమావేశం లో నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసిన అంబటి నేడు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తక్షణమే జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా తొలగించి, ఆ స్థానం లో చంద్రబాబు ను నియమించవలసింది గా నిమ్మగడ్డ గవర్నర్ కి లెటర్ రాసినా ఆశ్చర్య పోకండి…పిచ్చి ముదిరింది అంటూ అంబటి రాంబాబు సెటైర్స్ వేశారు. అయితే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ లో బాగంగా నేడు పంచాయతి ఎన్నికలకి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అటు కరోనా వైరస్ కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని, ప్రజల ఉద్యోగుల ప్రాణాలకి భద్రత దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి చెబుతుంది. మరొకసారి అంబటి రాంబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు పట్ల ఇలా వ్యాఖ్యలు చేయడం తో వీటికి ఎలా స్పందిస్తారో చూడాలి.