నిమ్మగడ్డ రమేష్ మరో రాజకీయానికి తెర తీశారు – అంబటి రాంబాబు

Wednesday, October 28th, 2020, 07:27:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి ను కారణంగా చూపించి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈ సి నిమ్మగడ్డ రమేష్ పై అగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా మరొకసారి నిమ్మగడ్డ రమేష్ తీరు పై వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీం కోర్టు ఏం చెప్పిందో చదువుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహిస్తే బావుండేది అని అంబటి రాంబాబు అన్నారు. అయితే ఒకసారి ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తెలుసుకోవాలి అని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని అంబటి రాంబాబు గుర్తు చేశారు. అయితే బుదవారం నాడు జరిగే ఎస్ ఈ సి సమావేశానికి వైసీపీ వెళ్ళడం లేదు అని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ను సంప్రదించకుండా, ముందుగా రాజకీయ పార్టీలను పిలవడం పట్ల ఎస్ ఈ సి కి వేరే ఉద్దేశ్యాలు ఉన్నాయి అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే సమావేశానికి వైసీపీ వెళ్ళడం లేదు అని తేల్చి చెప్పారు. అయితే ఏపీ లో మూడు కరోనా కేసులు కూడా లేని రోజుల్లో ఏ రాజకీయ పార్టీ లను అడిగి ఎన్నికలను వాయిదా వేశారో నిమ్మగడ్డ రమేష్ సమాధానం చెప్పాలి అంటూ అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల పై చర్చ అంటూ నిమ్మగడ్డ మరో రాజకీయానికి తెర తీశారు అంటూ అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఏపీ లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉందా లేదా అనే దాని పై ప్రభుత్వం తో చర్చ జరపకుండా పార్టీలను పిలవడం నిమ్మగడ్డ చంద్రబాబు రాజకీయం లో భాగం అంటూ అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు.