చంద్రబాబూ…పట్టపగలే మందు కొట్టావా? – అంబటి రాంబాబు

Thursday, February 18th, 2021, 07:31:28 AM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయం లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబూ…నీకు మతి భ్రమించిందా లేక పట్టపగలే మందు కోట్టావా అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ వీధుల్లో సీఎం జగన్ ను ఇష్టమొచ్చినట్లు తిడతావా, ఫ్రస్ట్రేషన్ తో దిగజారి మాట్లాడతావా అంటూ మండిపడ్డారు. శవాలను పీక్కుతినే రాబందు లా బాబు వ్యవహరిస్తున్నారు అని అంబటి రాంబాబు విమర్శించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమ ను రక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నారు అని, ప్రజలు, కార్మిక సంఘాలు సీఎం కృషి పట్ల అభినందనలు తెలియజేశారు అని అంబటి రాంబాబు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అని మండిపడ్డారు.

అయితే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కి ఒక్క లేఖ కూడా ఎందుకు రాయడం లేదు అంటూ అంబటి రాంబాబు చంద్రబాబు ను సూటిగా ప్రశ్నించారు. అయితే సీఎం జగన్ వస్తున్నారు అని తెలిసే, ఒక రోజు ముందు చంద్రబాబు నాయుడు అక్కడి కి వెళ్ళారు అని ఆరోపించారు. అయితే అక్కడ ఆయన చిల్లరగా మాట్లాడిన తీరు చూస్తే నవ్వొస్తుంది అని అంబటి రాంబాబు అన్నారు. పిరికి వాళ్లు దైర్యం తెచ్చుకోవాలట, అక్కడ పోరాడుతున్న ప్రజలు పిరికి వాళ్ళా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు చావు దెబ్బ తినడం తో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు.