దేశంలోనే అతిపెద్దది “అమరావతి కుంభకోణం” – వైసీపీ ఎమ్మెల్యే

Tuesday, September 15th, 2020, 06:15:52 PM IST

Ambati_Rambabu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్దది అంటూ వైసీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పెద్ద స్కాం అని మేము ముందు నుండే చెబుతున్నాం అంటూ మరొకసారి గుర్తు చేశారు. బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాల భూమి కొనుగోలు చేశారు అని ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది అని, త్వరలో ఈ భారీ కుంభకోణం లో ఆశ్చర్యకర విషయాలు బయటికి రాబోతున్నాయి అంటూ అంబటి రాంబాబు అన్నారు.

అయితే ఈ వ్యవహారం లో చట్టాలను, బౌండరీలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారు అని గత ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. ఈ స్కాం పై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి విన్నవించుకుంది అని, అయితే చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పు చేయకపోతే సీబీఐ వేయమని కేంద్రాన్ని కొరండి అంటూ అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు తప్పు చేశారు కనుక విచారణ కోరడం లేదు అని తేల్చి చెప్పారు. అయితే ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ బినామీ లకు టెండర్లు ఇచ్చి 2 వేల కోట్ల రూపాయల స్కాం కి పాల్పడ్డారు అని ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. అయితే వరుసగా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మరి దీని పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.