అమరావతి లో ప్రజా ఉద్యమమే లేదు – అంబటి రాంబాబు

Tuesday, August 25th, 2020, 01:33:38 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అమరావతి రాజధాని అంశం పై రైతులు, ప్రజలు ఇంకా నిరసన వ్యక్తం చేస్తూ తమ ఆందోళన తెలుపుతున్నారు. అయితే ఈ వ్యవహారం పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి లో ప్రజా ఉద్యమమే లేదు అని అంబటి రాంబాబు అన్నారు. అక్కడ జరిగేది భూస్వాముల, పెట్టుబడి దారీ, ధనవంతుల ఉద్యమం అని అన్నారు. రాజదాని కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నట్లు చంద్రబాబు భ్రమ కల్పిస్తున్నారు అని అన్నారు. అమరావతి పెద్ద స్కాం అని, చంద్రబాబు తన తాబేదార్ల కోసం పెట్టిన పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజదాని కోసం 85 మంది మరణించిన దాఖలాలు లేవు అని అంబటి రాంబాబు అన్నారు. సాధారణ మరణాలను అలా చూపిస్తున్నారు అని టీడీపీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు ఇచ్చిన భూముల్ని టీడీపీ నేతలు బలవంతం గా లాక్కున్నారు అంటూ ఆరోపించారు. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు, ఇక పై మరి కొందరిని అరెస్ట్ చేస్తారు అంటూ తెలిపారు. అయితే అభివృద్ది అంతా కూడా హైదరాబాద్ లో కేంద్రీకృతం కావడం వలన చాలా నష్టం జరిగింది అని, ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదని సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ చేశారు అంటూ వ్యాఖ్యానించారు.