వైసీపీ నేతలు ఇంత దారుణంగా తయారయ్యారేంటి..!?

Sunday, April 5th, 2020, 09:10:24 AM IST

ఇప్పుడు కరోనా కారణంగా మన దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా నెలకొనని విధమైన పరిస్థితులు నెలకొంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా పలువురు అధికార పార్టీ నేతలు మరియు కార్యకర్తలు దానిని కూడా తమ పార్టీ స్వార్ధ ప్రయోజనాల కోసం వినియోగిస్తుండడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతుంది.

ప్రస్తుతం మన దేశ రాష్ట్రాల్లో పరిస్థితులు పూర్తిగా దెబ్బతినేసరికి కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు సహా మన రాష్ట్రానికి కూడా వెయ్యి కోట్లకి పైబడే నిధులు విడుదల చేసారు. దీనితో డబ్బులను కూడా తమ ఖాతాలోకి వేసేసుకొని ఈ డబ్బులు జగన్ ఇస్తున్నాడంటూ పలువురు వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు వాలంటీర్ల చేత ప్రచారం చేస్తున్నారు.

పైగా ఈ డబ్బు తీసుకొని వచ్చే మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ కే ఓటు వేయాలని ప్రజల సామాన్య హక్కును కాల రాయడం దుర్మార్గం అనే చెప్పాలి.ఇది తెలియని ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు.తెలిసిన వారు ఈ డబ్బులకు మీకు సంబంధం లేదని నిగ్గు దీసి అడుగుతున్నారు.ఈ విషయాన్నే ఏపీ బీజేపీ చీఫ్ కన్నా కూడా ప్రశ్నించారు. అయినా ఇలాంటి సమయంలో కూడా వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారు ఏంటో..ప్రస్తుతం ఇదే సోషల్ మీడియా అంతా పెడా దుమారం రేపుతోంది.