అయిదేళ్ళు దోచుకున్నారు కాబట్టే ప్రజలు టీడీపీ కి తగిన బుద్ది చెప్పారు

Tuesday, October 6th, 2020, 03:04:24 PM IST

అధికారం చేపట్టిన అనంతరం నుండి ప్రజల్లో వైసీపీ కి ఆదరణ పెరుగుతూ వస్తోంది. అయితే వర్షాలు, కరోనా వైరస్ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో లేని నేతలకు వైసీపీ ప్రభుత్వం పై మాట్లాడే అర్హత లేదు అని ఆ పార్టీ కి చెందిన నేత, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలో లో మీడియా తో మాట్లాడిన ఈయన తెలుగు దేశం పార్టీ నేతల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రజలకు సేవ చేస్తే స్వాగతిస్తాం, సమస్యలను మా దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అంతేకాక ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలి అని టీడీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గత తెలుగు దేశం పార్టీ హయం లో ప్రజలను దోచుకున్నారు కాబట్టే, టీడీపీ కి తగిన బుద్ది చెప్పారు అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రజలకు చేసింది ఏమి లేదు అని, వార్డుల్లో సీసీ రోడ్లు వేసి డ్రైనేజీ ఏర్పాటు చేయకపోవడం కారణంగా నేడు ఇళ్ళ ల్లోకి నీరు చేరి సమస్య వచ్చింది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.