ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తానని 30 వేలు తీసుకొని మోసం చేసిన వైసీపీ నేత

Sunday, December 27th, 2020, 03:00:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పేద ప్రజలకు ఇళ్ళ స్థలాల పంపిణీ ప్రక్రియ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే కొందరు మాత్రం అధికార వైసీపీకి మచ్చ తీసుకు వస్తున్నారు. ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తానని చెప్పి కొందరి వద్ద 30 వేల రూపాయలు తీసుకున్నాడు వైసీపీ నేత సురేంద్ర. చిత్తూరు జిల్లాలో పలమనేరు లో ప్రస్తుతం ఈ అంశం స్థానిక వైసీపీ నేతల ను కలవర పెడుతోంది.

సురేంద్ర కుమారుడు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తుండటంతో అక్కడి స్థానికులు సురేంద్ర ను నమ్మి ముప్పై వేల రూపాయలు ఇచ్చారు. అయితే ఇళ్ళ స్థలాల జాబితాలో సదరు ముప్పై వేల రూపాయలు ఇచ్చిన వారి పేర్లు రాకపోవడం తో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు సురేంద్ర ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాక సురేంద్ర కుమారుడి వాలంటీర్ ఉద్యోగం నుండి తప్పించాలని ఎమ్మెల్యే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే వైసీపీ నేతల పై తెలుగు దేశం పార్టీ కి చెందిన పలువురు నేతలు ఇటువంటి ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన పట్ల పలువురు నేతలు ఇప్పటికే చర్చలు జరుపుపుతున్నారు.