బిగ్ న్యూస్: పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు

Tuesday, April 13th, 2021, 05:04:39 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక అనివార్యం అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ ఉపఎన్నికలో గెలుపు బాట కోసం అధికార పార్టీ ప్రతి పక్ష పార్టీ నేతల పై వరుస విమర్శలు గుప్పిస్తుంది. మరొక పక్క ప్రతి పక్ష పార్టీ నేతలు అధికార వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా ప్రతి పక్ష పార్టీ నేతల పై అధికార పార్టీ వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ కి తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో 30 శాతం లోపు ఓట్లే వస్తాయి అని సర్వేలు చెబుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అయితే తెలుగు దేశం పార్టీ ఓటమి ఖాయం అయింది అని, అందుకే రాళ్ల దాడి డ్రామా ఆడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే అదే తరహాలో జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ క్వారంటైన్ కి వెళ్ళింది భయపడా? లేక డబ్బు అందకా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నుండి తెలుగు దేశం పార్టీ అద్యక్షుడి స్థాయికి పడిపోయారు అంటూ విమర్శలు చేశారు. అయితే క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకొని ఆయన మాట్లాడాలి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీని సీఎం జగన్ ఎన్నిసార్లు కలిసినా విభజన హామీలు నెరవేర్చలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.