బిగ్ న్యూస్: కరోనా ఎఫెక్ట్ తో వైసీపీ కీలక నేత మృతి

Sunday, October 4th, 2020, 11:00:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతునే ఉంది. ఏ ఒక్కరినీ కూడా ఈ మహమ్మారి విడిచి పెట్టడం లేదు. అయితే మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. విశాఖ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ నుండి కోలుకున్న ఈయన, అనారోగ్యం క్షీణించడంతో మృతి చెందారు. కరోనా వైరస్ మహమ్మారి కారణం గా ఊపిరి తిత్తుల కి ఇన్ఫెక్షన్ సోకిండం తో వెంటి లేటర్ పై చికిత్స అందిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఈయన మృతి చెందడం వైసీపీ వర్గాలను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది.

వైసీపీ లో ప్రస్తుతం ఈయన కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాఖ వి ఎం ఆర్ డీ ఏ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.