నేటి నుండి పట్టణాల్లో ఇంటింటికీ మార్చి నెల రేషన్

Tuesday, March 2nd, 2021, 07:35:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ప్రస్తుతం కీలకం అయింది ఇంటింటికీ రేషన్. పట్టణాల్లో నేటి నుండి ఇంటింటికీ మార్చి నెల కి సంబంధించి రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఫిబ్రవరి నెల కోటా సరుకుల్ని ఈ నెల మూడవ తేదీ వరకు పంపిణీ చేయాలనీ,మార్చి నెల కోటా ను నాల్గవ తేదీ నుండి అందించాలి అని పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది.అయితే ఇప్పటికే నూరు శాతం రేషన్ పంపిణీ పూర్తి అయిన గ్రామాల్లోని లబ్ది దారులకు సోమవారం నుండి సరుకులు అందజేయనున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు విప్లవాత్మక నిర్ణయాల కారణంగా పల్లెల్లో మార్పు వచ్చిన సంగతి తెలిసిందే. పంచాయతి ఎన్నికల్లో వైసీపీ తన సత్తా చాటింది. అయితే మునిసిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ కి పూర్తి ఆధిక్యం వస్తుంది అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. సీఎం జగన్ పాలనా, అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు సైతం ఆకర్షితులు అవుతున్న సంగతి తెలిసిందే.