టీడీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం…?

Thursday, February 13th, 2020, 08:56:36 PM IST

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోని టీడీపీ నేతలందరికీ కూడా ఘోరమైన షాక్ ఇచ్చిందని చెప్పాలి. కాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు జగన్ సర్కార్ మరొక షాక్ ఇచ్చింది. కాగా టీడీపీ సీనియర్ నేతలందరికీ కూడా భద్రతను తగ్గిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా ఇప్పటికే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరియు పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కి భద్రతను తగ్గించిన సీఎం జగన్ ప్రభుత్వం మరికొందరికి కూడా తగ్గించినట్లు ఉత్తర్వులకు కూడా జారీ చేసింది.

ఈమేరకు మాజీ హోంమంత్రి , టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్నటువంటి ఎస్కార్ట్ ను తొలగించింది. అంతేకాకుండా అలాగే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంకు కూడా ఎస్కార్ట్ తొలగించింది. అయితే ఇలా వైసీపీ ప్రభుత్వం భద్రతను కుదించడంతో టీడీపీ నేతలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం కావాలనే ఇలాంటి కుట్ర పూరిత చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు.