కాపీల రాయుడు..చంద్రబాబు నాయుడు – వైసీపీ

Wednesday, February 3rd, 2021, 02:20:36 PM IST

మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీరు పట్ల వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపదుతోంది. ఇప్పటికే వైసీపీ కి చెందిన నేతలు చంద్రబాబు నాయుడు తీరును విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోమారు వైసీపీ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాపిల రాయుడు చంద్రబాబు నాయుడు అంటూ సంబోధిస్తూ విరుచుకు పడింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నిర్వహణ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టో ను విడుదల చేసారు. దీని పై పలు విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.

టీడీపీ మేనిఫెస్టో నిండా వైసీపీ కార్యక్రమాలే అంటూ తెలిపింది. పంచాయతి ఎన్నికల మేనిఫెస్టో లో పంచాయతీల సహకారం తో మహిళల కి వడ్డీ లేని రుణాలు అందజేస్తాం అని చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే ఇది ఇప్పటికే వైసీపీ పాలన లో అమలు లో ఉందని తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికే వైఎస్సార్ ఆసరా పతాకాన్ని అమలు చేస్తూనే,పొదుపు సంఘాల మహిళలకి వడ్డీ లేని రుణాలను అమలు చేస్తున్న విషయాన్ని సోషల్ మీడియా వేదిక గా వెల్లడించడం జరిగింది. అయితే పంచాయతీ ఎన్నికల విషయం లో అటు టీడీపీ ఇటు అధికార పార్టీ వైసీపీ కి గెలుపు చాలా ముఖ్యం అని తెలుస్తోంది. ప్రతి పక్ష పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి పాలు అయి 23 స్థానాలకు పరిమితం అవ్వగా, ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సన్నాహాలు చేస్తుంది.