అక్కడికి వచ్చి మాట్లాడే దమ్ము అచ్చెన్నాయుడికి ఉందా?

Sunday, December 13th, 2020, 08:17:00 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పై టెక్కలి వైసీపీ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నాడు నేడు పథకం పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల పట్ల శ్రీనివాస్ ఘాటుగా వ్యాఖ్యానించారు. నాడు నేడు పథకం పనుల్లో నాణ్యత లోపం, అవకతవకలు ఎక్కడ ఉన్నాయో దమ్ముంటే అచ్చెన్నాయుడు ప్రకటించాలి అంటూ సవాల్ విసిరారు. నాడు నేడు కార్యక్రమం జరుగుతున్న పాటశాల ప్రధానోపాధ్యాయులు, కమిటీ లతో కలిపి ఒక వేదిక ఏర్పాటు చేస్తా అని, అక్కడికి వచ్చి మాట్లాడే దమ్ము అచ్చెన్నాయుడు కి ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే ఈ నాడు నేడు పథకం పనులు ఎంతో పారదర్శకంగా, నాణ్యతగా జరుగుతున్నాయి అని అన్నారు. అయితే టీడీపీ హయం లో అచ్చెన్న మరియు అతని కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి వేల కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు కూడా అదే భ్రమ లో ఉన్నారు అని, నాడు నేడు పనులు కాంట్రాక్టర్లు చేస్తున్నట్లు భావిస్తున్నారు అని అన్నారు. అయితే ఈ పతకం పనులను చేస్తున్నది కాంట్రాక్టర్లు కాదన్న విషయం వారు తెలుసుకోవాలి అంటూ అచ్చెన్న కి సెటైర్స్ వేశారు. అయితే వైసీపీ నేత చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.