గంటా కి వ్యతిరేకంగా నిరసన…ఇది సాధ్యం అయ్యే పనేనా!?

Friday, August 7th, 2020, 02:27:46 AM IST


తెలుగు దేశం పార్టీ కి చెందిన నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పై గత కొద్దీ రోజులుగా పార్టీ మార్పు పై పలు రకాల వార్తలు వస్తున్నాయి. అయితే వైజాగ్ ఇపుడు మరొక రాజధాని కావడం తో ఇపుడు గంటా చేరిక పై వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు మీడియా ఎదురుగా గంటా చేరిక ను ఖండించినా, వైసీపీ లోకి గంటా రావడం పక్కా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ మేరకు వైసీపీ గంటా కి వ్యతిరేకం గా వైజాగ్ లో ఆందోళన చేపట్టాయి. గంటా శ్రీనివాసరావు ను పార్టీ లో చేర్చుకోవ ద్దు అంటూ నిరసన వ్యక్తం చేశారు. వైజాగ్ లోని తగరపు వలస, చిన్నపురం, విఎం పాలెం వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే గంటా శ్రీనివాసరావు కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మాత్రమే కాకుండా, వైసీపీ అధిష్టానం కార్యకర్తల మనోభావాల్ని గుర్తించాలి అంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మూడు రాజధానుల నిర్ణయం పై గంటా శ్రీనివాసరావు అనుకూల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.