రఘురామ కృష్ణంరాజు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు!

Wednesday, September 16th, 2020, 12:54:28 AM IST

వైసీపీ అధికార పార్టీ కి చెందిన నేత అయినప్పటికీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పలు అంశాల పై రాష్ట్ర ప్రభుత్వం తీరు ను విమర్శించారు. అయితే వైసీపీ తరపున గెలిచి, తమపై విమర్శలు చేయడం పట్ల వైసీపీ అభిమానులు, నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా రఘురామ కృష్ణంరాజు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు ఆ నియోజక వర్గం వైసీపీ కార్యకర్తలు రఘురామ కృష్ణంరాజు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా చిత్తూరు జిల్లాలో రఘురామ కృష్ణంరాజు దిష్టి బొమ్మను వైసీపీ కార్యకర్తలు పీలేరు లో దహనం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి ఎటువంటి మచ్చ లేని నాయకుడు అని, అటువంటి నేత పై ఇష్టారీతి లో వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అని ఆయన అభిమానులు మండిపడ్డారు. అంతేకాక రఘురామ కృష్ణంరాజు ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే పలు అంశాలలో సీఎం జగన్ కి లేఖ రాసిన రఘురామ కృష్ణంరాజు, తాజాగా జరిగిన ఈ సంఘటన తో ఎలా స్పందిస్తారో చూడాలి.