సలార్ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యశ్

Friday, January 15th, 2021, 02:02:07 PM IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా తెరకక్కనున్న సలార్ చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం ను శుక్రవారం ఉదయం నాడు ప్రారంభించారు. అయితే ఈ సినిమా కార్యక్రమం కి కన్నడ నటుడు యశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ప్రభాస్ మరియు యశ్ లు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కేజీఎఫ్ చిత్రం తో కేవలం కన్నడ చిత్ర పరిశ్రమ లో మాత్రమే కాకుండా ఇండియా లో అన్ని చోట్ల ప్రశాంత్ నీల్ తన సత్తా చాటాడు. కేజీఎఫ్ చిత్రం కి కొనసాగింపు అయిన కేజీఎఫ్2 కూడా ఈ సమ్మర్ కి విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల కి ముందే టీజర్ తో అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. పాన్ ఇండియా గా ఇంత క్రేజ్ ను సంపాదించుకున్న కేజీఎఫ్ దర్శకుడు, బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ లు ఇద్దరు కూడా కలిసి పని చేస్తుండటం తో ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.