మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది.. తొడగొట్టి చెప్పిన యరపతినేని..!

Monday, December 21st, 2020, 06:03:32 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాజాగా పల్నాడులో జరిగిన ఓ సభలో మాట్లాడిన యరపతినేని వైసీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

అయితే తొడగొట్టి మీసం మెలేసి చెబుతున్నా మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరి అంతు చూస్తామని అన్నారు. తమను ఎంతగా అణిచివేస్తే అంతగా పైకి లేస్తామని పల్నాటి పౌరషాన్ని చేతల్లో చూపిస్తామని హెచ్చరించారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దివాళ తీయించారని, మూడు రాజధానుల నిర్ణయం ముమ్మాటికి అవివేకమని అన్నారు.