తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి కి దిమ్మతిరిగే షాక్

Sunday, November 22nd, 2020, 11:00:37 PM IST

తెలంగాణ రాష్ట్రం లో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కీలకం అయ్యాయి. ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకోవాలనీ తెరాస, ఇటు ఈ సారి అధికార పార్టీ పై విజయం సాధించాలని బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ లు ఎదురు చూస్తున్నాయి. అయితే ఇప్పటికే ఒకరి పై మరొకరి మద్య మాటల యుద్దాలు నడుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యం లో తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కి చేదు అనుభవం ఎదురైంది.

రోడ్డు వేస్తేనే ఈసారి తాము ఓట్లు వేస్తామని యాప్రాల్ లో స్థానికులు రోడ్డెక్కారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే ను అడ్డుకున్నారు. అయితే తనను అడ్డగించడం తో ఎమ్మెల్యే స్థానికులతో చర్చించారు. ఎన్నికల తరువాత తన సొంత నిధులతో రోడ్డు వేయిస్తా అని అక్కడి వారికి హామీ ఇచ్చారు. అయితే అక్కడి స్థానికులు, తాము ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నామని, మీ సొంత నిధులు మాకు అక్కర్లేదు అని తెలిపారు. అయితే స్థానికులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఎన్నికల అనంతరం రోడ్లు వేస్తామని తెలిపారు. అయితే అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యే కి ఇటువంటి పరిస్తితి రావడం పట్ల నెటిజన్లు చర్చించుకుంటున్నారు.