ఏపీ రాజధాని అమరావతి గ్రామాల రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ టీడీపీ జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే జైల్ భరో కార్యక్రమానికి హాజరు కాకుండా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడిక్కడ ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులపై, ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు.
అయితే టీడీపీ నాయకుల హౌస్ అరెస్టులను ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం గర్హనీయమని యనమల విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అణిచివేత ఏపీలో అమలవుతోందని అసలు ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా అని ప్రశ్నించారు. దరఖాస్తు చేసినా నిరసనలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.