ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు ఇంతకంటే పరాకాష్ట ఏముంటుంది – యనమల

Sunday, February 7th, 2021, 09:00:55 PM IST

Yanamala

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం కి, అధికార పార్టీ వైసీపీ కి మధ్యన మాటల యుద్దాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలుగు దేశం పార్టీ కీలక నేత యనమల రామకృష్ణుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను ప్రభావితం చేయడం, అధికారులను బెదిరించడం రాజ్యాంగ ఉల్లంఘనే అంటూ చెప్పుకొచ్చారు. అయితే పంచాయతీ లతో సంబంధం ఉండే పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎన్నికల్లో ఏ విధంగా జోక్యం చేసుకుంటారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక ఎన్నికల పై ప్రభావితం చేసే విధంగా ఎన్నికల కమిషనర్ పై, అధికారుల పై ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారు అంటూ యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మంత్రులు కూడా పబ్లిక్ కి సర్వెంట్స్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఒక వైపు నామినేషన్లు వేస్తుంటే మరో వైపు బెదిరిస్తూ ప్రకటనలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు ఇంతకంటే పరాకాష్ట ఏముంటుంది అంటూ మండిపడ్డారు. అయితే మంత్రుల వ్యవహార శైలి పై ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకునే విధంగా వారే అవకాశం కల్పించారు అంటూ యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. అయితే కోడ్ ఉల్లంఘన చేసిన వారు మంత్రి అయినా, పార్టీ కార్యకర్త అయినా చర్య తీసుకొనే అధికారం ఎన్నికల కమిషనర్ దే అంటూ చెప్పుకొచ్చారు. అయితే బలవంతపు ఏకగ్రీవాలను మంత్రులు ఎలా ప్రోత్సహిస్తారు అంటూ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పై యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.