అధికార యంత్రాంగాన్ని జగన్ నిర్వీర్యం చేశారు – యనమల

Sunday, January 24th, 2021, 08:06:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరి పై తెలుగు దేశం పార్టీకి చెందిన కీలక నేత యనమల రామకృష్ణుడు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక యధేచ్చగా అన్ని ఉల్లంఘనలే అంటూ ఘాటు విమర్శలు చేశారు. అధికార యంత్రాంగాన్ని జగన్ నిర్వీర్యం చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అన్ని వర్గాల హక్కుల అణచివేతే జగన్ అజెండా అంటూ యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పై గవర్నర్ జోక్యం చేసుకోవాలి అని యనమల రామకృష్ణుడు కోరారు. రాజ్యాంగాన్ని, ప్రజా స్వామ్యం ను గవర్నర్ కాపాడాలి అంటూ చెప్పుకొచ్చారు. రాజ్యాంగ బద్ధ పాలన జరిగే విధంగా చూడాలి అని, జగన్ తుగ్లక్ చర్యల కి ప్రజలు గుణపాఠం చెప్పాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.