ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే, సీఎం జగన్ చోద్యం చూస్తున్నారు – యనమల రామకృష్ణుడు

Sunday, May 9th, 2021, 06:09:25 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే రాష్ట్రం లో పాజిటివ్ కేసులు మరణాలు భారీగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది అంటూ టీడీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా వైసీపీ పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ కీలక నేత యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కట్టడి లో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు.

అయితే ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే సీఎం జగన్ చోద్యం చూస్తున్నారు అంటూ యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ప్రపంచమంతా కరోనా పై పోరాడుతుంటే సీఎం జగన్ మాత్రం, ప్రత్యర్థుల పై పోరు లో బిజీగా ఉన్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే సీఎం జగన్ పాలనా సమయం మొత్తం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే ఉపయోగిస్తున్నారు అని విమర్శించారు. అయితే ఎన్ 440 కే వైరస్ గురించి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుగానే అప్రమత్తం చేయడం తప్పా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే కరోనా వైరస్ వైఫల్యాలను కప్పి పుచ్చుకోనేందుకు చంద్రబాబు, లోకేష్ ల పై అక్రమ కేసుకు బనాయిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.