ఏపీలో కోవిడ్ వైరస్‌కి గేట్లు ఎత్తేశారు.. యనమల రామకృష్ణ కామెంట్స్..!

Wednesday, August 12th, 2020, 06:45:44 PM IST

yanamala ramakrishnudu

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనిపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రభుత్వ పని తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో కోవిడ్ వైరస్‌కు గేట్లు ఎత్తేశారని, కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు.

అంతేకాదు డాక్టర్లు, వైద్య సిబ్బందిని ముందస్తుగా నియమించుకోలేదని, రోగులకు సరైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని అన్నారు. అమెరికా, బ్రెజిల్ స్థాయికి ఏపీ చేరుతుండడం సిగ్గుచేటన్నారు. ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారని, కరోనాతో సహజీవనం ఇదేనా అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కరోనా కారణంగా రోజుకు 90 మంది ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్ర వీడడం లేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన 8 వేల కోట్లు ఏం చేశారని, అసలు దేనిదేనికి ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.