జగన్ సర్కార్‌పై మండిపడ్డ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు..!

Saturday, September 12th, 2020, 04:30:37 PM IST

జగన్ సర్కార్‌పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న రాజధాని భూములపై సిట్ నివేదిక లీక్ చేయడం ధిక్కారమేనని అన్నారు. వారి అవినీతిని బయటపెట్టారనే జగన్ కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నది జగన్ అనుచరులేనని, జగం ఆలోచనలే సిట్ చెబుతుందని చెప్పుకొచ్చారు.

అయితే కరోనా కట్టడిలో కూడా జగన్ ప్రభుత్వం విఫలమయ్యిందని, మూడు ముక్కలాట వంటి తుగ్లక్ చర్యలతో రాష్ట్రం మరింత వెనకబడిపోయిందని అన్నారు. 5 ఏళ్ల తర్వాత అమరావతి సరిహద్దుల్లో అవకతవకలు జరిగాయనడం ఏమిటని అన్నారు. తన తండ్రి హయాంలో హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అష్టవంకర్లు తిప్పారని, మెదక్ జిల్లాలో వైఎస్ కుటుంబం ‘కొల్లూరు భూముల కుంభకోణం’ తెలిసిందేనని అన్నారు. భూముల ధరలు పెంచి వందల కోట్ల భూ కుంబకోణాలకు పాల్పడ్డారని అన్నారు. ఇకనైనా నేరపూరిత, కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని సూచించారు.