రైతులకు చేసిన ద్రోహానికి వైసీపీ మూల్యం చెల్లించక తప్పదు – యనమల

Wednesday, September 2nd, 2020, 05:53:07 PM IST

Yanamala

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రైతుల ఆత్మహత్యలలో ఏపీ రెండవ స్థానంలో ఉందంటే అది నిజంగా జగన్ గారి ఘనతే అని ఎద్దేవా చేశారు. రీతుల రుణమాఫీకి చెందిన 8 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు.

అంతేకాదు రైతులకు ఇవ్వాల్సినవి ఇవ్వక అప్పుల ఊబిలోకి నెట్టారని అన్నారు. వేలాది ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా లాకున్నారని, 300 కోట్ల ధాన్యం బకాయిలను కూడా ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని అన్నారు. నాగలి పట్టాల్సిన రైతన్నలు పురుగుమందు డబ్బా లు పట్టుకుని పొలాల్లో తిరిగే దుస్థితి తీసుకువచ్చారని అన్నారు. రైతులకు చేసిన ద్రోహానికి వైసీపీ మూల్యం చెల్లించక తప్పదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.