గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనా.. వైసీపీకి యనమల సూటి ప్రశ్న..!

Sunday, August 16th, 2020, 09:25:53 PM IST

yanamala ramakrishnudu

ఏపీ అధికార పార్టీ వైసీపీపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మరోసారి మండిపడ్డారు. గ్రామ స్వరాజ్యమంటే, వైసీపీ ఆర్థిక స్వరాజ్యం కాదని అన్నారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ.. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.

అంతేకాదు ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం గ్రామ స్వరాజ్యమా అంటూ నిలదీశారు. తప్పుడు కేసులు పెట్టి, నామినేషన్లు విత్ డ్రా చేయించడం మీ గ్రామ స్వరాజ్యమా? 8 వేల కోట్ల కరోనా నిధులను దారి మళ్ళించడం గ్రామ స్వరాజ్యమా అని అన్నారు. గ్రామీణ అభిభివృద్ధికి టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ఖర్చులో మూడోవంతు కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదని మీరా గ్రామ స్వరాజ్యం గురుంచి మాట్లాడేది అని అన్నారు.